జహీర్ ఇక్బాల్ తో హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి.. చికంకారి ధరించింది
on Jun 24, 2024
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ శత్రుఘ్నసిన్హా(Shatrughan Sinha) ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అశేష అభిమానులని పొందాడు. ఆయన వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయురాలిగా ముందుకు దూసుకుపోతున్న నటి సోనాక్షి సిన్హా . 2010 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ తో తన సినీ ప్రస్థానం మొదలయ్యింది. మొదటి సినిమాతోనే యువకుల కలల రాణిగా మారి ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
హీరోయిన్ సోనాక్షి సిన్హా(sonakshi sinha)వివాహం జహీర్ ఇక్బాల్ ( zaheer iqbal)తో అత్యంత వైభవంగా జరిగింది. ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఈ వివాహానికి కొద్దిమంది బంధు మిత్రులకి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి నే ఇనిస్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. పెళ్లి సమయంలో తెలుపురంగు చికంకారి ఎంబ్రాయిడరీ చీర ధరించింది. జహీర్, సోనాలి లు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారు. వేరు వేరు మతాలు అయినా ఇరు వైపు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
బాస్, వెల్ కమ్ టూ న్యూయార్క్ , కాకుడా, ఆల్ ఈజ్ వెల్, హిమ్మత్ వాలా, జోకర్, ఫోర్స్ 2 , ఆర్ రాజ్ కుమార్ వంటి దాదాపు ముప్పైకి పైగా సినిమాల్లో సోనాక్షి నటించింది. ఇక జహీర్ కూడా బాలీవుడ్ లో హీరోగా పలు చిత్రాలు చేసాడు.నోట్ బుక్, డబుల్ ఎక్స్ ఎల్ వంటి సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డబుల్ ఎక్స్ ఎల్ లో సోనాక్షి, జహీర్ లు కలిసి చేసారు. ఇక శత్రుజ్ఞ సిన్హా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు.కేంద్ర మంత్రిగాను పని చేసాడు.
Also Read